స్పీకర్‌, 12 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

స్పీకర్‌, 12 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు హైకోర్టు మరోసారి నోటీసులు జారీ చేసింది. స్పీకర్ సహా అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకూ నోటీసులు పంపించింది. సీఎల్పీని టీఆర్ఎస్‌లో విలీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ చేసిన న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.