నాని, బోండా, వెంకన్నలకు హైకోర్టు నోటీసులు

నాని, బోండా, వెంకన్నలకు హైకోర్టు నోటీసులు

తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే బోండా ఉమమహేశ్వరరావు, పోలీస్ హోసింగ్ బోర్డ్ చైర్మన్ నాగుల మీరా, మేయర్ కోనేరు శ్రీధర్‌లకు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి, రవాణాశాఖ కమిషనర్ బాల సుబ్రహ్మణ్యం పై దౌర్జన్యం కేసులో వీరికి నోటీసులిచ్చింది. 2017లో రవాణా శాఖ కమిషనర్‌పై దౌర్జన్యానికి పాల్పడ్డారంటూ జరిగిన వివాదాన్ని సుమోటోగో స్వీకిరించి హైకోర్టు విచారణ చేసింది. ఈనెల 30వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.