తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్‌

తెలంగాణ సర్కార్‌కు హైకోర్టు షాక్‌

మునిసిపల్‌ ఎన్నికలపై తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఇవాళ నోటీసులిచ్చింది. మునిసిపల్‌ ఎన్నికలపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. వార్డుల విభజన, ఇతర ప్రక్రియల్లో తప్పులు దొర్లాయని అభిప్రాయపడిన ధర్మాసనం.. 109 రోజులు గడువున్నా ఎందుకంత వేగంగా చేశారని ప్రశ్నించింది. ఎందుకంత హడావిడి అని సూటిగా ప్రశ్నించింది.  కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించిన న్యాయస్థానం.. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.