పదో తరగతి పరీక్షల మీద క్లారిటీ ఇచ్చిన కోర్టు...అక్కడ వద్దు !

పదో తరగతి పరీక్షల మీద క్లారిటీ ఇచ్చిన కోర్టు...అక్కడ వద్దు !


తెలంగాణలో పదో తరగతి పరీక్షల విషయంలో కొనసాగుతోన్న ఉత్కంఠ ఈరోజుకు తెరపడింది. రెండు రోజులుగా ఈ అంశం కోర్టులో నలుగుతోంది. విద్యార్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహిస్తామని చెబుతోంది ప్రభుత్వం. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. అయితే జీహెచ్ఎంసీ పరిధిలో కాకుండా మిగతా రాష్ట్రంలో పరీక్షలకు ఓకే చెప్పింది కోర్ట్. జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో తప్ప మిగతా పిల్లలందరికీ సోమవారం నుండి పరీక్షలు జరగనున్నాయి. జీహెచ్ ఎంసీ పరిధిలోని  విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షకు అనుమతించాలని ఆదేశించింది. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను కూడా రెగ్యులర్ గా గుర్తించాలని పేర్కొంది.

అయితే జీహెచ్ ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో జాగ్రత్తలు  తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలని ప్రభుత్వం కోరగా, కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు ? ఆ బాధ్యత ఎవరు  తీసుకుంటారు? అని ప్రశ్నించింది హైకోర్టు. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమన్న హైకోర్టు, పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైన్ మెంట్ గా మారితే ఏంచేస్తారని అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెహ్ఎంసీ లో పెరుగుతున్న కేసుల దృష్ట్యా లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా పది రోజులకోసారి పరిస్థితి సమీక్షించాలని హైకోర్టు ఆదేశించింది. పరీక్షలు జరుగుతున్న ప్రాంతాల్లో కరోనా కేసులు పెరిగితే అక్కడ వాయిదా వేసేలా నిర్ణయం తీసుకోవాలని చెబుతూ తదుపరి  విచారణ 19 వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.