రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరపాలి  - హైకోర్ట్ 

రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరపాలి  - హైకోర్ట్ 

తెలంగాణాలో గత కొన్ని రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.  11 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నాడు.  ఈ సమ్మె కారణంగా ప్రజా రవాణా స్తంభించిపోయింది.  వాహనాలు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  దసరా సందర్భంగా ఊర్లకు వెళ్లిన ప్రజలు ఇంకా నగరానికి చేరుకోలేదు.  ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపేది లేదని, కార్మికులను తొలగిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పడంతో ఖమ్మం జిల్లాకు చెందిన డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.  దీంతో కార్మికులు సమ్మెను ఉదృతం చేశారు.  

దీనిపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది.  ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు కొంత అసహనాన్ని వ్యక్తం చేసింది.   తెలంగాణ ప్రభుత్వం ప్రజలవైపు ఉండదా?  అని ప్రశ్నించింది .  ఇప్పటి వరకు ఆర్టీసీ ఎండిని ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని అడిగింది. తక్షణమే ఆర్టీసీ ఎండిని నియమించాలని ఆదేశాలు జారీ చేసింది.   ప్రజలకోసం కొత్త బస్సులను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు.  ఇక,  మహారాష్ట్ర, గుజరాత్ లో రవాణ వ్యవస్థ బాగుందని,  అందుకే అక్కడ పెట్టుబడులు వస్తున్నాయని హైకోర్ట్ పేర్కొన్నది.  ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని,   రెండు రోజుల్లో కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టింది.  ఆర్టీసీ సమ్మెపై తదుపరి విచారణను అక్టోబర్ 18 కి వాయిదా వేసింది హైకోర్ట్.  మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.