రాజేంద్రనగర్ లో తీవ్ర ఉద్రిక్తత.. రణరంగంగా మారిన మాణిక్యమ్మ బస్తీ !

రాజేంద్రనగర్ లో తీవ్ర ఉద్రిక్తత.. రణరంగంగా మారిన మాణిక్యమ్మ బస్తీ !

రాజేంద్రనగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ మాణిక్యమ్మ బస్తీ రణరంగంగా మారింది. హంతకుడు బాల్ రాజ్ ఇంటి పై హత్యగావింపబడ్డ రమేష్ కుటుంబ సభ్యులు దాడి చేసి పెట్రోల్ పోసి ఇంటికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. బాల్ రాజ్ అన్న ఇంటి పై కూడా దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రాజేంద్రనగర్ పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. బాల్ రాజ్ ఇంటి పై దాడికి దిగిన హత్యగావింపబడ్డ రమేష్ బందువులు, ఇంటికి నిప్పు పెట్టినట్లు చెబుతున్నారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో ముప్పు తప్పింది. గత నెల 26 తేదీ రాజేంద్రనగర్ నడి రోడ్డు పై రమేష్ అనే వ్యక్తిని అతి దారుణం కొడవలితో మాజీ రౌడీ షీటర్ బాల్ రాజ్ దాడి చేశారు. విచక్షణారహితంగా రమేష్ శరీరం పై పలుచోట్ల కత్తి పోట్లు పొడవడంతో స్పాట్ లోనే కుప్పకూలిపోయాడు రమేష్.

హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించినా 13 రోజుల పాటు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొంది మరణించారు. అర్ధరాత్రి పరిస్థితి విషమించడంతో తెల్లవారుజామున రమేష్ తుది శ్వాస విడిచారు. రమేష్ మృతితో పోస్టు మార్టం అనంతరం రమేష్ మృతదేహంతో రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీ కి చేరుకున్న కుటుంబ సభ్యులు. బాల్ రాజ్ ఇంటి ముందు మృతదేహాన్ని నుంచి ఆందోళన చేపట్టారు. అయితే కోపం కట్టలు తెంచుకోవడంతో బాల్ రాజ్ ఇంటి పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ఆందోళన చేస్తున్న ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు. అన్యాయంగా తన భర్తను పొట్టన పెట్టుకున్నాడు అంటూ నా భర్తను చంపిన వాడి ప్రాణం నాకు కావాలంటూ కన్నీరు మున్నీరుగా భార్య విలపిస్తోంది.