అమల్లోకి పెరిగిన పింఛన్లు..

అమల్లోకి పెరిగిన పింఛన్లు..

పింఛన్‌దారులకు గుడ్ న్యూస్.. పెంచిన పింఛన్లు ఇవాళ్టి నుంచి అమల్లోకి రానున్నాయి. పెరిగిన పింఛన్లకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందించనున్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్థులకు ఇస్తున్న పింఛన్‌ను రూ.1000 నుంచి రూ.2016కు, దివ్యాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3016కు పింఛన్లు పెరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త పింఛన్లు అందించనుంది టీఆర్ఎస్ సర్కార్. ముందే చెల్లించాలని భావించినా.. వివిధ ఎన్నికలకు సంబంధించిన కోడ్‌ అమల్లో ఉండడంతో అదికాస్త ఆలస్యమైంది.