బిజీగా ఉన్నా కర్తవ్యాన్ని మరవలేదు..

బిజీగా ఉన్నా కర్తవ్యాన్ని మరవలేదు..

పెళ్లి పనులతో బిజీగా ఉన్నప్పటికీ ఓ కుటుంబం కర్తవ్యాన్ని మరువలేదు. మరికాసేపట్లో పెళ్లి ఉందనగా.. సకుటుంబ సపరివారంగా వచ్చి మనాలిలోని బూత్‌ నెం.8లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. సంప్రదాయ అలంకరణతో ఉన్న పెళ్లి కుమారుడికి పోలింగ్‌ ఆఫీసర్‌ శుభాకాంక్షలు తెలిపారు. 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 స్థానాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. 918 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ చివరిదశ పోలింగ్‌లో తేలనుంది. ఏడో విడత ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా 1.12 లక్షల పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలను మోహరించింది.