రాజన్‌కు విశ్వహిందూ పరిషత్‌ ఆహ్వానం

రాజన్‌కు విశ్వహిందూ పరిషత్‌ ఆహ్వానం

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి తరవాత ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను ఆహ్వానించింది విశ్వ హిందూ పరిషత్‌(వీహెచ్‌పీ). ఈ ఏడాది సెప్టెంబర్‌ నెలలో ప్రపంచ హిందూ కాంగ్రెస్‌ను చికాగోలో నిర్వహిస్తోంది. ప్రపంచ మతాల పార్లమెంటును ఉద్దేశించి స్వామి వివేకానంద చేసిన చరిత్రాత్మక ప్రసంగానికి 125 ఏళ్ళయిన సందర్భంగా వీహెచ్‌పీ, ఇతర హిందూ సంస్థలు చికాగో సమావేశం నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశానికి రఘురామ్‌ రాజన్‌ను ఆహ్వానించిన మాట నిజమేనని వీహెచ్‌పీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే రాజన్‌ మాత్రం కచ్చితంగా వస్తానని హామి ఇవ్వలేదని తెలుస్తోంది. రావడానికి కచ్చితంగా ప్రయత్నిస్తానని మాత్రం రాజన్‌ అన్నట్లు వీహెచ్‌పీ వర్గాలు తెలిపాయి. ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉన్న సమయంలో రాజన్‌ తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో రాజన్‌ను ఆహ్వానించడం ప్రత్యేక సంతకరించుకుంది.