దారుణంగా దెబ్బతిన్న హీరో

దారుణంగా దెబ్బతిన్న హీరో

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న హీరో కార్తికేయ చేసిన రెండవ చిత్రం హిప్పీ.  ఈ సినిమా తన మొదటి చిత్రానికంటే ఎన్ని రెట్లు బాగుంటుందని కార్తికేయ నమ్మకంగా చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి.  ట్రైలర్లో కూడా బోల్డ్ కంటెంట్ ఉండటంతో సినిమాలో బలమైన పాయింట్ ఏదో ఉంటుందని అనుకున్నారు. 

తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే చిత్రంలో ప్రాపర్ స్టోరీ అనేదే లేకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.  విమర్శకులు సైతం పెదవి విరవడంతో మొదటిరోజే నెగిలెటివ్ టాక్ ఏర్పడింది.  వారాంతంలో  అయినా సినిమా పుంజుకుంటుంది అనుకుంటే అలా కూడా జరగలేదు.  వసూళ్లు మరింత క్షీణించాయి.  దీంతో చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణంగా దెబ్బతిని అధిక మొత్తం వెచ్చించి కొత్త డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిలే పరిస్థితి తలెత్తింది.  కార్తికేయ కెరీర్ సైతం ఇబ్బందుల్లో పడింది.