సినిమా ప్రచారం కోసం ప్యాంట్ విప్పేస్తారా..?

సినిమా ప్రచారం కోసం ప్యాంట్ విప్పేస్తారా..?

సినిమా ప్రచారంలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయి. ప్రచారం చేసి సినిమాను జనాల్లోకి  తీసుకెళ్లడానికి నానా తంటాలు పడుతున్నారు. మొన్నటి వరకు ప్రచారం కలర్ఫుల్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిపేవారు.  మీడియా ముందుకు వెళ్లి సినిమా గురించి మాట్లాడేవారు.. కాలేజీలు, రెస్టారెంట్స్ కు వెళ్లి ప్రమోషన్ చేసేవారు.  కానీ, ఇప్పుడు ప్రచారం మారిపోయింది.  

ఎప్పుడు లేని విధంగా కొత్తగా ప్రచారం చేస్తున్నారు.  హిప్పీ సినిమా కోసం హీరో కార్తికేయ, నటుడు జెడిలో కొత్త దారిలో వెళ్లి ప్రచారం చేస్తున్నారు.  హిప్పీ ప్రచారం కోసం ఓ టీవీ మీడియాలో ఇంటర్వ్యూకి వెళ్లారు.  అక్కడ యాంకర్ ప్రశ్నలు అడగ్గా దానికి మాటలతో కాకుండా కార్తికేయ షర్ట్ విప్పేసి బాడీ ప్రదర్శిస్తే... జెడి చక్రవర్తి మరో అడుగు ముందుకేసి... ప్యాంట్ విప్పేసి థైస్ ను ప్రదర్శించాడు.  దీంతో అక్కడ షో లో ఉన్న యాంకర్ అవాక్కయింది.