ఈ పండు ఒక్కటి తింటే చాలు...ఎందుకో తెలుసా?
చైనా అనగానే ఎర్రటి డ్రాగన్ బొమ్మ కనిపిస్తుంది. ఆ డ్రాగన్ ఎర్రటి మంటలను కక్కుతోంది. ఈ డ్రాగన్ పేరుతో ఓ పండు ఉన్నది. అదే డ్రాగన్ ఫ్రూట్. ఇది చూడటానికి డ్రాగన్ నోట్లో నుంచి వచ్చే మంటల్లా ఉంటుంది. అందుకే దీనికి డ్రాగన్ ఫ్రూట్ అనే పేరు వచ్చింది. మనదేశంలో ఈ పండు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 70 రూపాయల వరకు ఉంటుంది. ఒకప్పుడు ఎక్కడో ఒక చోట ఈ పండ్లు లభించేవి. కానీ, ఇప్పుడు విరివిగా పండ్లు లభిస్తున్నాయి.
డ్రాగన్ ఫ్రూట్ లో అనేక ఔషధ గుణాలు ఉండటం విశేషం. ఈ పండు గుజ్జు అరటిపండు గుజ్జులా కొద్దిగా తెలుపుగా ఉంటుంది. అలానే అరటిపండులో ఉన్నట్టుగానే గింజలు ఉంటాయి. వీటిని ఇష్టంగా తింటారు. ఇక ఈ పండులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పండులో సి, ఈ విటమిన్లు, అలానే ఐరన్, మెగ్నీషియం కూడా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండే ఈ ఫ్రూట్ ను రోజు తీసుకుంటే బరువు తగ్గుతారు. రోజు ఈ పండు తినేవారు చురుకుగా ఉంటారట. ఇందులో ఉండే పీచు పదార్ధం జీర్ణక్రియకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అలానే, గుండె జబ్బులను రాకుండా అడ్డుకోవడంలో ఈ ఫ్రూట్ ఉపయోగంగా ఉంటుంది. ఈ పండులో ఉండే బెటాలైన్స్, కెరొటినాయిడ్స్ లు క్యాన్సర్ రాకుండా అడ్డుకోవడంలో సహాయపడతాయి. ఎక్కడో దక్షిణ అమెరికా దేశంలో పుట్టిన ఈ పండు ఇప్పుడు ప్రపంచవ్యాప్తం అయ్యింది.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)