ట్విట్టర్లో ట్రెండింగ్ - యూపీలో టెన్షన్ 

ట్విట్టర్లో ట్రెండింగ్ - యూపీలో టెన్షన్ 

ఎన్నో దశాబ్దాలుగా వివాదంలో ఉన్న అయోధ్య వివాదం ఒక కొలిక్కి వచ్చేలా కనిపిస్తోంది.  సుప్రీం కోర్టు ఈ కేసును ప్రతిషాత్మకంగా తీసుకొని ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసి 40 రోజులపాటు వాదనలు విన్నది.  అక్టోబర్ 16 వ తేదీన  తీర్పును రిజర్వ్ చేశారు.  ఈనెల 17 వ తేదీలోగా తీర్పు వెలువడబోతున్నది.  దీంతో అయోధ్య టెన్షన్ వాతావరణం నెలకొన్నది.  అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు.  సోషల్ మీడియాపై నిఘా పెంచారు.  నాలుగు అంచల భద్రతను ఏర్పాటు చేశారు.  

ఇక ప్రస్తుతం హిస్టరీ అఫ్ అయోధ్య అనే ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నది.  అయోధ్య చరిత్ర, అయోధ్య ప్రాశస్తంగురించి తెలుసుకోవడానికి ఈ ట్యాగ్ ను క్రియేట్ చేశారు. అయోధ్య గురించి, అయోధ్య చరిత్ర గురించిన ఎన్నో విషయాలను ఈ ట్యాగ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉన్నది.