హిట్ టాక్ తెచ్చుకున్న రజినీ, అజిత్ సినిమాలు !

హిట్ టాక్ తెచ్చుకున్న రజినీ, అజిత్ సినిమాలు !

తమిళనాడు మొత్తం పండుగ వాతావరణం కనిపిస్తోంది.  స్టార్ హీరోలు రజినీకాంత్ నటించిన 'పేట', అజిత్ నటించిన 'విశ్వాసం' సినిమాలు ఈరోజే థియేటర్లలోకి దిగాయి.  చెన్నై నగరవ్యాప్తంగా ప్రీమియర్ షోలు వేస్తున్నారు.  దీంతో ఎక్కడ చూసినా అభిమానుల సందడే కనిపిస్తోంది.  ఇక ఫలితాల  విషయానికొస్తే 'విశ్వాసం' సినిమాకు హిట్ వస్తుండగా 'పేట' చిత్రం బ్లాక్ బస్టర్ అంటున్నారు.  పూర్తి ఫలితం ఏమిటనేది ఇంకొద్దిసేపట్లో తేలిపోనుంది.  మొత్తానికి ఈ సినిమాలతో తమిళ సినీ పరిశ్రమకు ఈ ఏడాది సూపర్ స్టార్ట్ లభించిందని చెప్పొచ్చు.