వెస్టిండీస్ క్రికెటర్ ఆవేదన... మా నాన్న నల్లగా ఉన్నారని... 

వెస్టిండీస్ క్రికెటర్ ఆవేదన... మా నాన్న నల్లగా ఉన్నారని... 

గత కొన్ని రోజులుగా క్రికెట్ ప్రపంచం లో జాతి  వివక్షత పై పెద్ద చర్చే జరుగుతుంది. మొదట  వెస్టిండీస్ ఆటగాళ్లు తాము ఎదుర్కొన  జాత్యహంకారాన్నిగురించి తెలిపారు. ఇక ఆ తర్వాతా మిగితా జట్టు క్రికెటర్లు కూడా ఈ విషయం పై నోరు విప్పారు. ప్రస్తుతం.. వెస్టిండీస్ లెజెండ్ మైఖేల్ హోల్డింగ్ ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులు ఎదుర్కొన్న జాత్యహంకారాన్ని గురించి తెలుపుతూ ఆవేదన చెందరు.  హోల్డింగ్ మాట్లాడుతూ...  మా నాన్న  నల్లగా  ఉన్నారని నా తల్లి కుటుంబం మాతో మాట్లాడటం మానేసింది అని చెప్పారు. క్రికెట్ లో జాతి  వివక్షత అంతరించాలి, అయితే ఇది నెమ్మదిగా జరిగే ప్రక్రియ, కానీ జరుగుగుతుంది అని నేను ఆశిస్తున్నాను అంటూ వివరించారు. సౌతాంప్టన్‌లో బుధవారం ఇంగ్లండ్, వెస్టిండీస్‌ల మధ్య జరిగిన తొలి టెస్టుకు ముందు రేబియన్ జట్టు ఆటగాళ్లు మైదానం లోకి ప్రవేశించిన వెంటనే బ్లాక్ లైవ్స్ మేటర్‌కు మద్దతుగా అందరూ మోకాలి మీద కూర్చొని పిడికిలిని పైకి లేపారు.