సైరాకి హాలీవుడ్ టెక్నీషియన్ 

సైరాకి హాలీవుడ్ టెక్నీషియన్ 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగానే ఓ కొత్త షెడ్యూల్ మొదలవ్వగా..దాదాపు 35 రోజుల పాటు నిరవధికంగా జరగనుంది. హైదరాబాద్ పరిసరాల్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ను తెరకెక్కించడానికి హాలీవుడ్ కొరియోగ్రాఫర్ గ్రెగ్ పావెల్ ను రంగంలోకి దించారు. 

గతంలో ఈయన హ్యారీ పోటర్, స్కైఫాల్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 6 వంటి చిత్రాలకు పనిచేశారు. సైరా సినిమాలో చిరు..బ్రిటిష్ కోటపై దాడి చేసి ఆయుధాలను దొంగలించే సీన్స్ ను గ్రెగ్ చాలా బాగా బ్రిలియంట్ గా చూపారట. అలాగే ఈ సీన్ లో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రంలో రెండు లేదా మూడు వార్ సీన్స్ లో అద్భుతంగా డిజైన్ చేశారట. ఇప్పుడు జరుగుతున్న షెడ్యూల్ లో యాక్షన్ ఎపిసోడ్ తో పాటు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, కిచ్చా సుదీప్, అమితాబ్ బచ్చన్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యేలా నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నారు.