‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ సెట్ లో హాలీవుడ్ దర్శకుడు

‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ సెట్ లో హాలీవుడ్ దర్శకుడు

‘ఆర్ఆర్ఆర్’ మరోసారి సినీ ప్రపంచం మాట్లాడుకొనే తెలుగు సినిమా. దర్శకధీరుడు రాజమౌళి టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అజయ్ దేవగణ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ప్రముఖ హాలీవుడ్ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ సెట్ లో కనిపించాడు. దర్శకుడు రాజమౌళి, నిక్ పావెల్ క్లైమాక్స్ సీన్ ను చర్చించుకునే వీడియోను అభిమానులతో పంచుకుంది చిత్రబృందం. ప్రస్తుతం ఈ సినిమాకి హాలీవుడ్ దర్శకుడు కూడా తోడైయ్యాడంటే రాజమౌళి క్లైమాక్స్ సీన్ ఎంత అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.