హాలీవుడ్ డైరెక్టర్ ను మెప్పించిన రాజమౌళి దృశ్యకావ్యం..!!

హాలీవుడ్ డైరెక్టర్ ను మెప్పించిన రాజమౌళి దృశ్యకావ్యం..!!

బాహుబలి సీరీస్లో వచ్చిన బాహుబలి 2 సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.  సినిమాలో యాక్షన్స్ సీన్స్ చాలా ఉన్నాయి.  అందులో వార్ కు సంబంధించిన సీన్స్ ను రాజమౌళి తెరకెక్కించిన విధానం వావ్ అనిపించే విధంగా ఉన్నాయి. బాలీవుడ్ ప్రేక్షకులకు అలాంటి యాక్షన్ సీన్స్ కొత్త కావడంతో బాహుబలిని మెచ్చుకున్నారు.  బాహుబలి, బాహుబలి 2 రెండు సినిమాలు బాలీవుడ్ లో సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి.  

ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ను చాలా క్యూరియాసిటీగా తీశాడు రాజమౌళి.  ఇందులో యాక్షన్ ఎపిసోడ్.. ముఖ్యంగా తాటిచెట్ల మీదనుంచి దూకే సన్నివేశాన్ని షూట్ చేసిన విధానం ఆకట్టుకుంది.  సామాన్య ప్రేక్షకులని కాదు.. హాలీవుడ్ దర్శకులను కూడా ఈ సీన్ ఆకట్టుకుంది.  ప్రభాస్ అతని సైన్యంతో కలిసి కోట లోపలికి ప్రవేశించడానికి తాటిచెట్లను విల్లులా ఉపయోగించి సైనికులే బాణంలా దూసుకుపోయే సీన్ ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు.  ఆ సీన్ ట్విట్టర్లో క్షణాల్లో వైరల్ గా మారింది.  ఈ సీన్ ను చూసిన హాలీవుడ్ దర్శకుడు స్కాట్ "ఇండియన్ బాహుబలి 2" అని క్యాప్షన్ ఇచ్చారు.  హాలీవుడ్ దర్శకుడు ఈ సీన్ ను మెచ్చుకుంటూ క్యాప్షన్ ఇవ్వడంతో బాహుబలి 2 మరోసారి వార్తల్లోకి వచ్చింది.