హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను మెప్పించిన ప్రభాస్

హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ ను మెప్పించిన ప్రభాస్

ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తికావొచ్చింది.  ఇండియన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎవరూ చూడని, ఎవరి ఊహకు అందని విధంగా స్టంట్స్ ఉండబోతున్నాయి.  ఇందులో కొన్ని స్టంట్ ఎపిసోడ్స్ ను హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బ్యాట్స్ ను తీసుకున్నారు.  కళ్ళు చెదిరే స్టంట్స్ ను డిజైన్ చేశారట.  ఎంతో కష్టంతో కూడుకున్న ఈ స్టంట్స్ ను ప్రభాస్ చాలా ఈజీగా చేశారని కితాబిచ్చారు.  ప్రభాస్ డెడికేషన్, కమిట్మెంట్ కు ఫిదా అయినట్టు ఓ సందర్భంలో కెన్నీ పేర్కొన్నాడు. 

సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 15 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్, జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ తదితరులు నటిస్తున్నారు.  యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది.