ఉయ్యాలవాడలో హాలీవుడ్ ఫైట్లు

ఉయ్యాలవాడలో హాలీవుడ్ ఫైట్లు

ఖైదీ నెంబర్ 150 తరువాత మెగాస్టార్ నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం సైరా.  స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు.  దీనికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేట పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.  అయితే, ఈ సినిమాలోని పోరాట సన్నివేశాలను హాలీవుడ్లో పేరు ప్రఖ్యాతలు పొందిన స్టంట్ మాస్టర్లు రూపొందించబోతున్నారు.  

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్, స్కైఫాల్ వంటి భారీ చిత్రాలకు యాక్షన్ పార్ట్ లను రూపొందించిన గ్రెగ్ పావెల్ సైరా సినిమాకు యాక్షన్ సన్నివేశాలకు దర్శకత్వం వహించబోతున్నారు. దాదాపు రూ.200 కోట్ల రూపాయలతో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.  రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నయనతార, జగపతిబాబులు నటిస్తున్నారు.  వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.