బాబుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. హోంమంత్రి స్పష్టీకరణ

బాబుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ.. హోంమంత్రి స్పష్టీకరణ

తనకు భద్రత తగ్గించారని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.  2014కు ముందు మాజీ సీఎం హోదాలో తనకు ఎలాంటి భద్రత అయితే ఉండేదో ఇప్పుడు కూడా అలాంటి భద్రతే ఉండాలి కోరారు.  దీనిపై స్పందించిన రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రత కల్పిసున్నామని స్పష్టం చేశారు. 

అంతేకాదు బాబుగారు ఇంకా తానే ముఖ్యమంత్రినని అనుకుంటున్నారని, ఆయన ప్రైవేట్ ఆస్తులకు భద్రత కల్పించడం వీలుకాదని అంటూ అక్రమ కట్టడాల కూల్చివేత వ్యవహారాన్ని పక్కదారి పట్టించడం కోసమే చంద్రబాబు ఈ భద్రతా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని విమర్శిస్తూ ప్రతి అంశాన్ని రాజకీయానికి వాడుకోవడం సరైన పద్దతి కాదని సూచించారు.