ఇళ్ల కొనుగోలుదారులకు కేంద్రం వరం

ఇళ్ల కొనుగోలుదారులకు కేంద్రం వరం

ఇంటి కొనుగోలుదారులకు మరింత భరోసా కల్పించేలా కేంద్రం అడుగు ముందుకు వేసింది. ఇంటి కొనుగోలుదారులను ఆర్థిక రుణదాతలుగా గుర్తించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ దివాలా తీసిన సమయంలో తమ పెట్టుబడులను సులభంగా రాబట్టుకునేందుకు మార్గం సుగమం కానుంది. రుణం తీసుకున్న సంస్థ దివాళా తీసి వేలం వేసే సందర్భంలో ఇది వర్తిస్తుంది. ఇన్‌సాల్వెన్సీ అండ్‌ బ్యాంక్‌రప్టసీ కోడ్‌ 2016 (ఐబిసి)లో చేసిన సవరణల ఆర్డినెన్స్‌నూ కేంద్రం ఆమోదించింది. ప్రతిపాదిత సవరణలకు సంబంధించిన వివరాలను రాష్ట్రపతి ఆమోదం తర్వాత తెలియజేస్తామని మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ చెప్పారు. రుణదాతలుగా పరిగణిస్తే ఇళ్ల కొనుగోలుదారులకు మరింత రక్షణ లభిస్తుందని, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంపొందుతుందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు గృహాల కొనుగోలుదారులు ఆపరేషన్‌ క్రెడిటార్లుగా ఉండేవారని, దివాళా తీసిన సంస్థల ఆస్తులను  విక్రయించిన సందర్భంలో వీరు తమ పెట్టుబడిని పొందడంలో తక్కువ ప్రాధాన్యం ఉండేదని వారు చెబుతున్నారు.