దేవేశ్వర్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

దేవేశ్వర్ మృతిపై సీఎం కేసీఆర్ సంతాపం

దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం ఐటీసీ ఛైర్మన్‌ వైసీ దేవేశ్వర్ మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి ఆయన ఎంతో మద్దతుగా నిలబడ్డారని సీఎం కేసీఆర్ అన్నారు. 2015లో టీఎస్-ఐపాస్ ఆవిష్కరణ కార్యక్రమంలో దేవేశ్వర్ పాల్గొన్న విషయం తెలిసిందే. మరోవైపు దేవేశ్వర్ మృతిపట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. భారతీయ బ్రాండ్లకు ప్రపంచవ్యాప్త గుర్తింపునకు బలమైన ప్రతిపాదకుడిగా నిలిచారన్నారు. ఐటీశాఖ మంత్రిగా ఉన్న సమయంలో దేవేశ్వర్‌తో జరిగిన భేటీలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.