భారత్ లోకి త్వరలో "హోండా సివిక్"

భారత్ లోకి త్వరలో "హోండా సివిక్"

మిడ్ రేంజ్ ఫోర్ వీలర్స్ లో హోండా నుంచి న్యూ వెర్షన్ త్వరలో భారత్ మార్కెట్లోకి రానుంది. ప్రస్తుత ఎడిషన్ ను మరింత మార్పుచేర్పులు చేసి పదో ఎడిషన్ గా హోండా సివిక్ ను తీసుకొస్తున్నారు. ఆకట్టుకునే విధంగా ఉన్న సివిక్ మోడల్ ను రివీల్ చేశారు. 
 
దీన్ని ఇండియా షోరూమ్స్ లోకి 2019 ఏప్రిల్ నాటికి ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ధర మాత్రం రూ. 18 లక్షల నుంచి రూ. 24 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. సివిక్ పోటీదార్లుగా స్కోడా యాక్టివా, హ్యుండాయి ఎలంట్రా, టయోటా కొరొలా ఆల్టిస్ తదితర ఫోర్ వీలర్స్ ఉంటాయని భావిస్తున్నారు. అయితే మిడ్ రేంజ్ లో ఇప్పటికైతే ఎలంట్రా కస్టమర్స్ ను బాగా ఆకట్టుకుంటోంది. మరి హోండా సివిక్ ఏ రేంజ్ లో మార్కెట్ ను కైవసం చేసుకుంటుందో చూడాలి. 

ఇక ఇండియా వెర్షన్ లో పెట్రోల్, డీజిల్ వెరైటీస్ ఉంటాయని మేనేజ్ మెంట్ ప్రకటించింది. డీజిల్ వెహికల్ (మ్యానువల్ వెర్షన్)లో 6 గేర్లు, ఆటోమేటెడ్ వెర్షన్లో 9 గేర్లు ఉంటాయని మ్యానుఫ్యాక్చరర్లు చెబుతున్నారు.