'బ్రియో'కు హోండా గుడ్ బై

'బ్రియో'కు హోండా గుడ్ బై

భారత్ లో తన ఎంట్రీ లెవల్ హ్యాచ్ బ్యాక్ బ్రియో కార్ల ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హోండా కంపెనీ తెలిపింది. 2011 సెప్టెంబర్ లో ఈ కారులను మార్కెట్లోకి విడుదల చేసి ఇప్పటి వరకు 97,000 బ్రియోలను విక్రయించింది. దీంతో హోండా కంపెనీ ఎంట్రీ లెవల్ కారుగా అమెజ్ ఆ స్థానాన్ని దక్కించుకుంది. బ్రియో ఉత్పత్తిని నిలిపివేస్తున్నామని, భావితరం కోసం బ్రియోను తీసుకువచ్చే ఆలోచన లేదని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డైరెక్టర్ రాజేష్ గోయల్ తెలిపారు. జాజ్, డబ్యూఆర్-వీ మోడళ్లు చిన్న కార్ల అవసరాలను తీరుస్తామని ఆయన అన్నారు. పెద్ద మోడళ్ల వైపు వినియోగదారులు ప్రాధాన్య మారోతోందని, ఈ ట్రెండ్ అంతర్జాతీయ మార్కెట్ల మాదిరిగా ఉందని ఆయన తెలిపారు. మరోవైపు వినియోగదారుల నుంచి అంతగా ఆదరణ లేకపోవడంతో 2017 సంవత్సరంలో మల్టీ పర్పస్ వెహికిల్ మొబిలియో ఉత్పత్తిని హోండా నిలిపివేసింది.