చక్కెరకు బదులు తేనె ఎంతో మేలు..

చక్కెరకు బదులు తేనె ఎంతో మేలు..

సహజమైన రుచికి దూరమవుతున్న మనిషి కృత్రిమ రుచులకు అలవాటు పడిపోయి చాలా తొందరగా రోగాలకు గురవుతున్నాడు. అలాంటి వాటిలో చక్కెర ఒకటి. ఈ తీయని శత్రువు నుంచి ఎంత తొందరగా బయటపడితే అంత ఎక్కువ కాలం బతుకుతాం అంటున్నారు నిపుణులు. 

నేచురల్ సప్లిమెంట్ గా తేనె:
తేనె అద్భుతమైన నేచురల్ సప్లిమెంట్ గా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. సహజసిద్ధమైన తేనెలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. 

ఎన్నో రకాల అలర్జీలకు ఒకటే జవాబు: 
అలర్జీలతో బాధపడుతూ ఒకపట్టాన నయం కాక కార్యాలయాల్లో అనేక ఇబ్బందులు పడేవారిని చూస్తూంటాం. వాటన్నిటికీ ఒకటే జవాబు తేనె. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరు తీసుకోవడం ద్వారా అలర్జీలకు చెక్ చెప్పవచ్చు. అయితే అదే వేడి నీటికి తేనె మిక్స్ చేస్తే అద్భుతంగా పని చేస్తుందంటున్నారు నిపుణులు. 

ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది: 
తేనెకు ఉన్న గొప్పగుణం మన ఎనర్జీ లెవల్స్ ను పెంచడం. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో పాల్గొనేవారు తేనెను రెండుపూటలా వాడాలి. ఇక ఎనర్జీ కోసం రోజుకో చెంచా ఉదయం గానీ లేదా.. మనం కావాలనుకున్నప్పుడు గానీ గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగితే ఆ రోజంతా ఎంత ఎనర్జిటిక్ గా కనిపిస్తారో స్వయంగా అనుభవించాల్సిందే. అలా కాకపోయినా కాఫీ లేదా టీ లో షుగర్ కు బదులు కలుపుకున్నా ప్రభావం కనిపిస్తుంది. 

స్వీట్ సిరప్ కు స్వస్తి పలకండి: 
ప్యాన్ కేక్, ఓట్ మీల్స్ వంటి ఇన్ స్టంట్ ఫుడ్స్ లో షుగర్ కు బదులు తేనె కలుపుకుంటే రోజుకు అవసరమైన మినరల్స్ శరీరానికి అందుతాయి. ఎంతో ఉత్సాహంగా రోజంతా పని చేసుకుంటారు. 

ఎనర్జీ బార్స్:
మీకు నచ్చిన రీతిలో ఎనర్జీ బార్స్ ను తయారు చేసుకొని.. వాటికి తేనెను అటాచ్ చేసి వాడి చూడండి... ఎంత ఎనర్జిటిగ్గా ఫీలవుతారో మీకే తెలుస్తుందంటున్నారు నిపుణులు. 

హానీ వాటర్ అద్భుత ఔషధం:
హానీ వాటర్ తయారు చేయడం చాలా తేలిక. గోరువెచ్చని నీటిలో చెంచా తేనె కలుపుకుంటే అదే హానీ వాటర్. తీయదనం కోసం మరీ ఎక్కువ మొత్తంలో తేనె కలుపుకోవాల్సిన పని లేదంటున్నారు నిపుణులు. దీన్ని ఎప్పుడు కావలిస్తే అప్పుడు... టీ, కాఫీలకు బదులుగా తీసుకోవచ్చు. వెయిట్ లాస్ ప్రోగ్రామ్ లో ఉన్నవారు ఉదయం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు మరోసారి తీసుకోవాలి. అలాగే ఇందులో విటమిన్ సీ కోసం కాస్త లెమన్, ఆరెంజ్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంచేందుకు జింజర్ ను కూడా కలుపుకోవచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే వారం రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది.

ఇలా రెగ్యులర్ గా తీసుకునే ఆహారానికే తేనెను యాడ్ చేయడం ద్వారా ఎన్నో రెట్ల ఫలితం వస్తుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఆలస్యమెందుకు? అనుసరించండి.