వైరల్: బ్రిటన్ మహారాణి హనీమూన్ ఫోటో చూశారా...
బ్రిటిష్ మహారాణి క్వీన్ ఎలిజిబిత్, ఆమె భర్త డ్యూక్ ఫిలిప్ లు ఇటీవలే 73 వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. నవంబర్ 20, 1947లో వీరి వివాహం జరిగింది. వివాహం అనంతరం క్వీన్ ఎలిజిబిత్, డ్యూక్ ఫిలిప్ లు హనీమూన్ కోసం హ్యాంప్ షైర్ లోని బ్రాడ్ ల్యాండ్ కు వెళ్లారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు కొన్నింటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ కలర్ లో ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 24 గంటల్లో 6 లక్షలకు పైగా లైక్ లను సొంతం చేసుకుంది ఈ ఫోటో. మరో 70 ఏళ్ళు ఇలానే హ్యాపీగా ఉండాలని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)