ఆ చిన్న పార్కింగ్ స్థలం ఖరీదు రూ. 7 కోట్లు

ఆ చిన్న పార్కింగ్ స్థలం ఖరీదు రూ. 7 కోట్లు

మనదేశంలో పార్కింగ్ కు స్థలం దొరక్క వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.  కొన్ని చోట్ల పార్కింగ్ కోసం అద్దెకు స్ధలం తీసుకొని అక్కడ పార్కింగ్ చేసుకుంటూ ఉంటారు.  అయితే, హాంకాంగ్ లో  పార్కింగ్ కోసం ఓ వ్యక్తి రూ. 7 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.  హాంకాంగ్ లోని ఓ ప్రముఖ ప్రాంతంలో పార్కింగ్ కోసం 135 చదరపు అడుగుల  పార్కింగ్ స్ధలం అమ్మకానికి వచ్చింది.  

ప్రైమ్ ఏరియాలో స్థలం అనే మాములు విషయం కాదు.  కొనాలంటే కోట్లలో ఉంటుంది.  పార్కింగ్ కోసం స్థలం కొనుగోలు చేయడం అంటే డబ్బును వృధాగా ఖర్చు చేసినట్టే.  కానీ, ఓ వ్యక్తిమాత్రం అవేమి పట్టించుకోకుండా 135 చదరపు అడుగుల స్థలాన్ని రూ. 7 కోట్లకు కొనుగోలు చేశారు.  జానీ చేయుంగ్ అనే వ్యాపారి ఈ స్థలాన్ని అమ్మారు.  అయితే, ఈ స్థలాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి పేరు మాత్రం బయటకు రావడం లేదు.