హానర్ 9ఎన్ విడుదల...

హానర్ 9ఎన్ విడుదల...

ప్రముఖ మొబైల్ సంస్థ హువావే నుండి హానర్ 9ఎన్ స్మార్ట్‌‌ఫోన్‌ తాజాగా మార్కెట్ లోకి విడుదల అయింది. 3 జీబీ, 4 జీబీ ర్యామ్ వేరియెంట్లలో జెన్‌ఫోన్ 5జెడ్ అందుబాటులోకి వచ్చింది. 3 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.11,999గా ఉంది. అలాగే 4 జీబీ రామ్, 32 జీబీ స్టోరేజ్ గల ఫోన్ ధర రూ.13,999గా ఉంది. 13, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు.. 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ విడుదల అయింది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఈ జులై 31వ తేదీ మధ్యాన్నం 12 గంటల నుండి  సేల్ ప్రారంభం అవనుంది. అయితే ఈ ఫోన్‌పై జియో రూ.2200 వరకు క్యాష్‌ బ్యాక్‌ను ఇస్తుంది.

ఫీచర్లు:

# 5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
# 1080 x 2280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
# ఆక్టాకోర్ ప్రాసెసర్
 # ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
# హైబ్రిడ్ డ్యుయల్ సిమ్
#  ఫింగర్‌ప్రింట్ సెన్సార్
# 4జీ వీవోఎల్‌టీఈ
# 3000 ఎంఏహెచ్ బ్యాటరీ