హ్యానర్ బ్యాండ్ 4 ధర ఎంతో తెలుసా!

హ్యానర్ బ్యాండ్ 4 ధర ఎంతో తెలుసా!

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ హువాయి సబ్ బ్రాండ్ హ్యానర్ తన నూతన ఫిట్ నెస్ బ్యాండ్ 4 ధరను 2,599గా నిర్ణయించింది. ఇటీవల భారత మార్కెట్లో హ్యానర్ 8సీ, హ్యానర్ బ్యాండ్ 4లను విడుదల చేసింది. కంపెనీ అప్పుడు కేవలం హ్యానర్ 8సీ ధరను మాత్రమే ప్రకటించింది. డిసెంబర్ 10 నుంచి అమెజాన్ లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇప్పుడు సంస్థ తన కొత్త ఫిట్ నెస్ బ్యాండ్ ధరను ప్రకటించి, మంగళవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అమెజాన్ లో లభించనున్నాయని తెలిపింది.  

ఇందులో 0.95 ఇంచుల అమోలెడ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. డ్యూయల్ కలర్స్ తో డీజైన్ చేసిన బ్యాండ్ 4 పసుపు, బ్లూ, ఆకుపచ్చ, ఎరుపు, పింక్ రంగుల్లో లభ్యమవుతుంది. హోమ్ బటన్‌, వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అలాగే హార్ట్ రేట్ సెన్సార్ కూడా పొందుపర్చారు. బ్లూటూత్ 4.2 ఎల్‌ఈ టెక్నాలజీ ఉన్న ఆండ్రాయిడ్, ఐఫోన్లకు ఈ బ్యాండ్ యాప్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇక ఈ బ్యాండ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసుకుంటే కాల్స్, మెసేజ్‌ల నోటిఫికేషన్లను పొందవచ్చు. 100 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ బ్యాండ్‌లో ఉంది. దీని వల్ల బ్యాండ్‌ను 14 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. పెడోమీటర్, స్లీప్ ట్రాకర్, ఎక్సర్‌సైజ్ ట్రాకర్, సెడెంటరీ రిమైండర్ తదితర ఫీచర్లను కూడా ఈ బ్యాండ్‌లో అందిస్తున్నారు.