హైదరాబాద్ లో పరువు హత్య.. ప్రణయ్ ని చంపినట్టే ?

హైదరాబాద్ లో పరువు హత్య.. ప్రణయ్ ని చంపినట్టే ?

 హైదరాబాద్‌లో పరువు హత్య కేసు కలకలం రేపుతోంది. కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుందనే కక్షతో.. యువకుడిని కిరాతకంగా హత్య చేయించాడు తండ్రి.! చందానగర్‌లో నివాసముంటున్న హేమంత్ అనే యువకుడు.. అదే ప్రేంతానికి చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీళ్లు గచ్చిబౌలిలోలోని TNGO కాలనీలో నివాసముంటున్నారు. ఈ వివాహాన్ని అంగీకరించని యువతి తండ్రి.. కిరాయి మనుషులతో యువకుడిని కిడ్నాప్ చేయించి.. సంగారెడ్డిలో హత్య చేయించాడు. ఆ యువతి పేరు అవంతి ఆమె తండ్రి పేరు లక్ష్మారెడ్డి. నిన్న మధ్యహ్నం ప్రేమ జంట ను గచ్చిబౌలి కిడ్నాప్ చేయగా యువతి కారు లో నుంచి పారిపోయిన 100కి సమాచారం ఇచ్చింది. అయితే సకాలంలో గచ్చిబౌలి పోలీసులు స్పందించలేదని ఆమె ఆరోపిస్తోంది. ఇక ప్రస్తుతం  హేమంత్ మృతదేహం ఉస్మానియాలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక విషయం మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.