రాశి ఫలాలు: 24 జనవరి 2019 గురువారం

రాశి ఫలాలు: 24 జనవరి 2019 గురువారం

మేషం: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పు ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. దైవ దర్శనం  చేసుకోవటం చేస్తారు.
వృషభం: 
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత  సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులను కలుస్తారు. 
మిథునం:
రోజంతా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ప్రమోషన్, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారికి ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను, బంధువులను  కలుస్తారు. ప్రయాణ అవకాశం ఉంది. 
కర్కాటకం:
మానసికంగా అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. అలాగే ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది.  దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
సింహం: 
ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణ సూచన ఉంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక విషయాల్లో జాగ్రత్త. 
కన్య: 
బద్ధకానికి, అసూయకు చోటివ్వకండి. సమస్యలు వచ్చే అవకాశముంది. కీలక నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఇప్పుడు తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే  అవకాశముంటుంది. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త.
తుల: 
ఆనందంగా గడుపుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
వృశ్చికం: 
కొత్త పని ప్రారంభించాలనుకుంటే దానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభంచేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఆటంకాలు తొలగి పోతాయి. ముఖ్య పనులు పూర్తవుతాయి.
ధనుస్సు: 
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. మీ శత్రువులతో జాగ్రత్త. వారి కారణంగా ఆర్థికంగా నష్టపోయే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.  ప్రయాణాల్లో జాగ్రత్త. 
మకరం: 
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఖర్చులు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆవేశానికి, అసహనానికి లోనుకాకండి. ముఖ్య పనులలో పట్టుదలతో  ప్రయత్నం చేయటం మంచిది.
కుంభం: 
మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతారు. రోజంతా ఆనందంగా ఉంటారు. కొత్త పనులు చేపట్టడానికి అనుకూల  సమయం. పెట్టుబడులకు అనువైన రోజు. విందువినోదాల్లో పాల్గొంటారు. 
మీనం: 
ఆరోగ్యం బాగుంటుంది. వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వాహనం కొనుగోలు చేస్తారు. మిత్రులను కలుస్తారు. ప్రయాణ  సూచన ఉంది.