రాశి ఫలాలు: 14 ఫిబ్రవరి 2019 గురువారం

రాశి ఫలాలు: 14 ఫిబ్రవరి 2019 గురువారం

మేషం:
బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ఆసక్తి చూపరు. కుటుంబ సభ్యుల కోపానికి గురవుతారు. ప్రయాణంలో జాగ్రత్త. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. మిత్రులు, బంధువులతో వివాదం జరగటం జరగవచ్చు. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా వ్యవహరించండి.
వృషభం:
రోజంతా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో అనుకోని శుభపరిణామాలు ఉన్నాయి. పెట్టుబడులకు అనుకూల దినం.
మిథునం:
వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూల సమయం. పై అధికారులను కలవటానికి, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలించే దినం. అనుకోని బహుమతులు, ప్రశంసలు  పొందుతారు. మీ మిత్రులు లేదా బంధువుల సహాయం అందుకుంటారు. ప్రయాణ సూచన ఉంది. 
కర్కాటకం:
రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. గురువులను లేదా ఆధ్యాత్మిక వేత్తలను కలుస్తారు. ప్రయాణంలో అడ్డంకులు ఎదురుకావొచ్చు. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం, ఇల్లు సర్దటం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
సింహం:
మానసికంగా ఆందోళనగా ఉంటారు. ఒక సంఘటన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక నష్టం, అనారోగ్యం, కలహాలు ఉన్నాయి. ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ముఖ్య విషయాల్లో పెద్దల సూచనలు తీసుకోండి. 
కన్య:
రోజంతా అనుకూలంగా ఉంది. సంబంధ, బాంధవ్యాలకు అనుకూలం. అలాగే ఒప్పందాలు, అంగీకారాలు కుదుర్చుకోవటానికి అనుకూల దినం. ప్రయాణం చేస్తారు. మీ ప్రేమను వ్యక్తం చేయటానికి అనువైన దినం. విందువినోదాల్లో పాల్గొంటారు.
తుల:
వివాదాలు పరిష్కరించుకోవటానికి అనుకూల దినం. మీ మాట నెగ్గుతుంది. అనుకూల ఫలితం పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు.
వృశ్చికం:
ఆనందంగా గడుపుతారు. ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. అయితే చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్య విషయాల్లో పెద్దల సూచనలు తీసుకోండి.
ధనుస్సు:
ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశముంటుంది.
మకరం:
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది.  వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు.
కుంభం:
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. అందుకు తగిన ఖర్చు కూడా ఉంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా  వస్తువు కొనుగోలు చేస్తారు. డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. ప్రయాణ సూచన ఉంది.
మీనం:
రోజంతా అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. ధనలాభం ఉంది.