రాశి ఫలాలు: 16 ఫిబ్రవరి 2019 శనివారం

రాశి ఫలాలు: 16 ఫిబ్రవరి 2019 శనివారం

మేషం: 
రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వలన ఇబ్బంది పడే అవకాశముంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
వృషభం: 
కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలం. అలాగే వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయటానికి అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఫలిస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
మిథునం: 
ఆర్థిక వ్యవహారాలలో, గృహ మరియు భూ సంబంధ లావాదేవీలలో జాగ్రత్త అవసరం. డబ్బు నష్టపోయే అవకాశముంది. శతృవుల విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. పై అధికారులతో ఇబ్బంది కలిగొచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త.
కర్కాటకం: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం, ఏదైనా అడ్డంకి ఎదురవటం జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు కొంత జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో పెద్దల సూచనలు పనికొస్తాయి.
సింహం:
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు, కమ్యునికేషన్‌కు అనుకూలం. విందులో పాల్గొంటారు.
కన్య: 
ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుట పడుతుంది. గృహసంబంధ వ్యవహారాలలో గడుపుతారు. బంధువులను కలుసుకోవటం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కరించబడతాయి. ప్రయాణ సూచన ఉంది. 
తుల: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.
వృశ్చికం: 
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. వాహన కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఇతరులతో జాగ్రత్త.
ధనుస్సు: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ట్రాన్స్ఫర్ కొరకు ఎదురుచూస్తున్నవారి కల ఫలిస్తుంది. మిత్రులను లేదా బంధువులను  కలుస్తారు. శుభకార్యంలో పాల్గొంటారు. 
మకరం: 
మానసికంగా అశాంతిగా ఉంటారు. పని చేయటానికి బద్ధకిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. బంధువులతో మాట కారణంగా సమస్య  వచ్చే అవకాశముంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
కుంభం: 
ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. శతృవుల విషయంలో జాగ్రత్త అవసరం. దూర  ప్రయాణాలు చేస్తారు.
మీనం: 
కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయటం చేస్తారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవటం మంచిది. ఖర్చుల విషయంలో జాగ్రత్త. పెట్టుబడులకు సామాన్య దినం. ప్రయాణ సూచన ఉంది.