రాశిఫలాలు: 21 ఫిబ్రవరి 2019 గురువారం

రాశిఫలాలు: 21 ఫిబ్రవరి 2019 గురువారం

మేషం:
కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వారికి సంబంధించిన పనులు పూర్తి చేయగలుగుతారు. ప్రేమను చెప్పటానికి అనుకూల దినం.  చిన్న ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం మంచిది. 
వృషభం: 
ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలం. కీలక విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
మిథునం: 
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బంధువులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యా పారం కలిసి వస్తుంది.
కర్కాటకం: 
ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. అయితే తగిన ఖర్చు కూడా ఉంటుంది. పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త.
సింహం: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయసహకారాలు అందుకుంటారు.
కన్య:
రోజంతా బద్ధకంగా గడుపుతారు. ఏ పని చేయటానికి ముందుకురారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మీ మిత్రులతో, దగ్గరి బంధువులతో వివాదం జరగటం జరగవచ్చు. ఆచితూచి మాట్లాడండి. భూ సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.
తుల: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. మిత్రుల నుంచి అనుకోని సాయం అందుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో శుభపరిణామాలు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రయాణ సూచన ఉంది. 
వృశ్చికం: 
వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. పై అధికారులను కలవటానికి శుభదినం. ముఖ్యమైన ఒప్పందాలకు కూడా అనుకూలించే దినం. అనుకోని బహుమతులు, ప్రశంసలు పొందుతారు. సహాయం అందుకుంటారు.
ధనుస్సు: 
రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఎక్కువగా చూపుతారు. ప్రయాణంలో అడ్డంకులు ఉన్నాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనటం చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
మకరం: 
మానసికంగా ఆందోళనతో ఉంటారు. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళనలు ఉన్నాయి. ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోవటం మంచిది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. ఏ విషయంలోనైనా జాగ్రత్తగా వ్యవహరించండి.
కుంభం:
రోజంతా అనుకూలంగా ఉంటుంది. సంబంధ, బాంధవ్యాలు, ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవటానికి అనుకూల దినం. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమను వ్యక్తం చేయటానికి అనువైన దినం. పిల్లల విషయంలో కొంత ఆందోళన చెందుతారు.
మీనం:
అన్ని పనులు చేయడానికి ఈ రోజు అనుకూల దినం. ఆర్థిక లాభాలుంటాయి. జీవిత భాగస్వామి అనారోగ్యం కొంత ఆందోళనకు కారణమవుతుంది. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు.