రాశిఫలాలు: 26 ఫిబ్రవరి 2019 మంగళవారం

రాశిఫలాలు: 26 ఫిబ్రవరి 2019 మంగళవారం

మేషం: 
మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణంలో అనుకోని లాభం కలుగుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూలంగా  ఉంటుంది.
వృషభం: 
ఉద్యోగ, ప్రయాణ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు.
మిథునం: 
అనుకున్న పనులు సమయానికి పూర్తి కావు. అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. స్నేహితుల కారణంగా సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.  ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు.
కర్కాటకం:
ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటుంది. కుటుంమ్బా సభ్యుల ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. చదువులో ఆటంకాలు ఏర్పడతాయి. భూ, వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి. కీలక విషయాల్లో పెద్దల సూచనలు పనికొస్తాయి.
సింహం: 
మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా వివాదాలు ఏర్పడటం జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కన్య: 
ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మాటతీరు కారణంగా ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. ఇతరుల వివాదాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.  ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు. ప్రయాణ సూచన ఉంది. 
తుల: 
స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.
వృశ్చికం:
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. 
ధనుస్సు: 
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు అందుతుంది. మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు.  ఉద్యోగ, వ్యాపారంలో శుభపరిణామాలుంటాయి.
మకరం: 
వ్యాపార, ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం, ఉద్యోగంలో మార్పు గురించి మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. పై అధికారులను కలవటానికి అనుకూల దినం. ప్రయాణ సూచన ఉంది. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోండి.
కుంభం: 
చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్య సమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు ఉన్నాయి. విందులో పాల్గొంటారు.
మీనం: 
చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు.