రాశి ఫలాలు: 4 ఫిబ్రవరి 2019 సోమ‌వారం

రాశి ఫలాలు: 4 ఫిబ్రవరి 2019 సోమ‌వారం

మేషం: 
రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బందిపడే అవకాశముంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
వృషభం: 
కొత్త పనులు ప్రారంభించడానికి, వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూలం. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా  ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు. 
మిథునం: 
ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో జాగ్రత్త. డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. శత్రువుల విషయంలో జాగ్రత్త అవసరం. వారి కారణంగా ఇబ్బంది కలిగించవచ్చు.  ప్రయాణాల్లో కూడా జాగ్రత్త. 
కర్కాటకం: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపాల్సి రావడం, ఏదైనా అడ్డంకి ఎదురవటం జరుగవచ్చు. ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. గొడవలకు  దూరంగా ఉండండి. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. 
సింహం:
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. ప్రయాణ  సూచన ఉంది.
కన్య:
ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. దూరపు బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు  వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి.
తుల: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణ సూచన ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు.  వివాడాలకు తావివ్వకండి.
వృశ్చికం: 
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాహన కొనుగోలు లేదా భూ సంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి.  ప్రశాంతంగా పనులు చేయండి. విజయం మీదే. 
ధనుస్సు: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఈ రోజు ముఖ్య సమాచారం అందుతుంది.  మిత్రులను లేదా బంధువులను కలుస్తారు. 
మకరం: 
మానసికంగా అశాంతిగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాలు విషయంలో  అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
కుంభం: 
ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి చెసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి  చేస్తారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
మీనం: 
రోజంతా బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయడం చేస్తారు. అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇతరులతో వ్యవహరించేటప్పుడు  జాగ్రత్త అవసరం.