రాశి ఫలాలు: 5 ఫిబ్రవరి 2019 మంగళవారం

రాశి ఫలాలు: 5 ఫిబ్రవరి 2019 మంగళవారం

మేషం: 
బంధువులను కలుసుకుంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల కోపానికి, అసహనానికి కారకులయ్యే అవకాశముంది. ఉత్సాహాన్ని, ఆవేశాన్ని అదుపులో  ఉంచుకోవడం మంచిది. కీలక విషయాల్లో పెద్దల సూచనలు తీసుకోండి. 
వృషభం:
వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి  శుభవార్త వింటారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
మిథునం: 
కుటుంబ సభ్యులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.  కీలక విషయాల్లో పెద్దల సూచనలు  తీసుకోండి.
కర్కాటకం: 
పై అధికారులతో, సహోద్యోగులతో స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంది. కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వాద వివాదాలకు దూరంగా ఉండండి.
సింహం: 
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ప్రయాణం, దేవాలయ సందర్శన చేస్తారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. ప్రయాణ సూచన ఉంది. 
కన్య: 
చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది.  ప్రయాణాలకు సాధారణ దినం.
తుల: 
డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు అందకపోవడం, పెట్టుబడుల కారణంగా నష్టపోవటం జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార  లావాదేవీలకు అనువైన దినం కాదు.
వృశ్చికం: 
ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. అస్వస్థతకు గురయ్యే అవకాశముంది. కుటుంబ వ్యవహారాల్లో అనుకోని ఆటంకాలు ఎదురయ్యే అవకాశముంది. పట్టుదలతో పనులు చేయండి. విజయం  మీదే.
ధనుస్సు:
ఆర్థిక వ్యవహారాల్లో ప్రగతి సాధిస్తారు. ఆర్థిక సహాయం సమయానికి అందుతుంది. మీ పై అధికారుల మెప్పు పొందుతారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ప్రయాణాలు చేస్తారు. 
మకరం: 
చేపట్టిన పనులు వాయిదా పడటం, అనుకోని అడ్డంకులు రావడం జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే  అవకాశముంది. కీలక విషయాల్లో జాగ్రత్త.
కుంభం: 
దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను  కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
మీనం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.