రాశి ఫలాలు: 7 ఫిబ్రవరి 2019 గురవారం

రాశి ఫలాలు: 7 ఫిబ్రవరి 2019 గురవారం

మేషం:
రోజంతా ఉత్సాహంగా ఉంటారు.మిత్రులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు.అత్యుత్సాహానికి పోయి చేసే పనుల వల్ల ఇబ్బందిపడే అవకాశముంటుంది. పుకార్లను, చెప్పుడు మాటలను పట్టించుకోకండి.  ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.
వృషభం:
కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలం. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో పదోన్నతికి సంబంధించిన ప్రయత్నం ఒక కొలిక్కి వస్తుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
మిథునం: 
ఆర్థిక వ్యవహారాల్లో, గృహ, భూ సంబంధ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. డబ్బు నష్టపోయే అవకాశముంది. శతృవుల విషయంలో కూడా జాగ్రత్త అవసరం. వారి కారణంగా ఇబ్బంది కలిగించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త. 
కర్కాటకం: 
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావడం, ఏదైనా అడ్డంకి ఎదురవడం జరగవచ్చు. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. గొడవలకు దూరంగా ఉండండి.
సింహం: 
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. విందువినోదాల్లో పాల్గొంటారు.
కన్య: 
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. గృహసంబంధ వ్యవహారాల్లో బిజీగా గడుపుతారు. బంధువులను కలుసుకోవడం జరుగుతుంది. మీ గృహానికి సంబంధించి కొనుగోలు వ్యవహారాలు లేదా ఇతర లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కరించబడతాయి. 
తుల: 
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా కొంత ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణం, ఉద్యోగంలో మార్పు ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు  అనుకూల దినం కాదు.
వృశ్చికం: 
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. మానసిక ఆందోళనకు, ఆవేశానికి గురికాకండి. కీలక  విషయాల్లో పెద్దల సూచనలు తీసుకోండి.
ధనుస్సు: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ట్రాన్స్‌ఫర్ కోసం ఎదురుచూస్తున్నవారికి ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను  లేదా బంధువులను కలుస్తారు. ప్రయాణ సూచన ఉంది.
మకరం: 
మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంటుంది. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
కుంభం: 
ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి. ప్రయాణాల్లో ఆటంకాలు ఉన్నాయి.
మీనం: 
కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని అయినా వాయిదా వేయడం చేస్తారు. మీ సహోద్యోగుల కారణంగా అసూయకు, ఆవేశానికి లోనవుతారు. ఏ నిర్ణయమైనా ఆలోచించి తీసుకోవడం మంచిది. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం.