రాశి ఫలాలు: 9 ఫిబ్రవరి 2019 శనివారం

రాశి ఫలాలు: 9 ఫిబ్రవరి 2019 శనివారం

మేషం: 
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఉన్నాయి. విలువైన వస్తువుల విషయంలో, నగల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అజాగ్రత్తగా ఉండకండి.
వృషభం: 
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. ప్రయాణ సూచన ఉంది.
మిథునం: 
ఉద్యోగం, వ్యాపారంలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి అనుకూల దినం. పై అధికారులతో మీ సంబంధాలు మెరుగవుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటకం: 
మిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. విశ్రాంతి  తీసుకోవడం మంచిది.
సింహం: 
మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడుతాయి. అనవసర ఖర్చులు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోండి.
కన్య: 
స్నేహితులతో, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.విందువినోదాల్లో పాల్గొంటారు. వాహనం కొనుగోలు, భూసంబంధ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది.
తుల: 
గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం, వాహనం కొనుగోలు చేయటం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి.
వృశ్చికం: 
ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, సాయం చేస్తా అన్నవారు సమయానికి మాట మార్చడం జరుగుతుంది. మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. కీలక విషయాల్లో అలోచించి నిర్ణయం తీసుకోండి.
ధనుస్సు:
 ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త.
మకరం: 
బంధువులను అసహనానికి గురి చేసే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో అలోచించి నిర్ణయం తీసుకోండి.
కుంభం: 
ఇతరులతో మాట్లాడేప్పుడు జాగ్రత్త అవసరం. మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. విందువినోదాల్లో పాల్గొంటారు. ప్రయాణ సూచన ఉంది.
మీనం: 
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో అనుకూల వాతావరణం. దూర ప్రయాణం చేస్తారు.