15 జనవరి 2019 మంగ‌ళ‌వారం మీ రాశి ఫలాలు

15 జనవరి 2019 మంగ‌ళ‌వారం మీ రాశి ఫలాలు

మేషం: 
స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశమున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.
వృషభం: 
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. ఒత్తిడికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులతో వ్యవహరించేప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి.
మిథునం: 
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు వస్తుంది. మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందుతుంది. పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారంలో అనుకోని శుభపరిణామాలుంటాయి. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం అవసరం. 
కర్కాటకం: 
వ్యాపార, ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీయానం, ఉద్యోగంలో మార్పులో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆనందంగా గడువుతారు. 
సింహం: 
దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కలుసుకుంటారు. అలాగే విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గురవుతారు. అనుకోని ఖర్చులు అవుతాయి. ఆధ్యాత్మిక క్షేత్రదర్శనం చేసుకుంటారు. ప్రయాణ సూచన ఉంది.
కన్య: 
చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూలదినం కాదు. 
తుల: 
మీ జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. కొత్త వస్తువులు, దుస్తులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులు నూతన లావాదేవీలు చేస్తారు. గృహ, వాహన సంబంధ కొనుగోళ్లు చేస్తారు. ప్రయాణ సూచన ఉంది.
వృశ్చికం: 
వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.పెట్టుబడులకు అనుకూలం కాదు.
ధనుస్సు: 
పనులు చివరి క్షణంలో వాయిదా పడతాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆవేశానికి లోనవకుండా ఉండటం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత.
మకరం: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వాహన కొనుగోలు, భూ సంబంధ లావాదేవిలు వాయిదా పడతాయి. ఆర్థిక లావాదేవీలకు, పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. కీలక విషయాల్లో జాగ్రత్త. 
కుంభం: 
ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్త అవసరం. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకండి. అనవసర సమస్యలో ఇరుక్కోవాల్సి వస్తుంది.
మీనం: 
ఆర్థికంగా బాగుంటుంది. సమయానికి డబ్బు వస్తుంది. ఖర్చులు ఎక్కువ. వివాదాలకు దూరంగా ఉండండి. ఆహారం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. ప్రయాణ సూచన ఉంది. సలహాలు కూడా ఇవ్వకండి.