రాశి ఫలాలు: 29 జనవరి 2019 మంగళవారం

రాశి ఫలాలు: 29 జనవరి 2019 మంగళవారం

మేషం:
మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ధనలాభం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు.  ప్రయాణ సూచన ఉంది.
వృషభం:
ఉద్యోగ, ప్రయాణ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో తొందరపడి  నిర్ణయాలు తీసుకోకండి.
మిథునం:
అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం, అనుకోని అడ్డంకులు ఎదురవుతాయి. మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ  వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ప్రయాణాల్లో జాగ్రత్త. 
కర్కాటకం:
ఆరోగ్యం విషయంలో ఇబ్బంది ఉంటుంది. తల్లిగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. భూ, వాహన సంబంధ వ్యవహారాలు వాయిదా పడతాయి. ప్రయాణ సూచన ఉంది. కీలక  విషయాల్లో కుటుంబ సలహాలు తీసుకోండి. 
సింహం:
మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా వివాదాలు ఏర్పడతాయి. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి  అనుకోని సాయాన్ని పొందుతారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు.
కన్య:
ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి. ఆర్థికంగా  సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటుచేసుకోవచ్చు.
తుల:
స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశముంది. ఉద్యోగ విషయంలో సామాన్య దినం. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.  విందులో పాల్గొంటారు.
వృశ్చికం:
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు, ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులతో వ్యవహరించేటప్పుడు  కూడా జాగ్రత్త అవసరం.
ధనుస్సు:
ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బు రావటం జరుగుతుంది. మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందటం జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తి  చేయగలుగుతారు. ఉద్యోగ, వ్యాపారంలో అనుకోని శుభపరిణామాలుంటాయి. 
మకరం:
వ్యాపార, ఉద్యోగ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. విదేశీయానం, ఉద్యోగంలో మార్పు వంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం.  మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విందువినోదాల్లో పాల్గొంటారు.
కుంభం:
దూరప్రదేశం నుంచి వచ్చిన మిత్రులను కలుసుకుంటారు. విదేశీయానానికి సంబంధించి ఒక ముఖ్యసమాచారాన్ని అందుకుంటారు. పని ఒత్తిడి కారణంగా అలసటకు గరవుతారు. అనుకోని ఖర్చులు  ఉన్నాయి. 
మీనం:
పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణంలో జాగ్రత్త అవసరం.  పెట్టుబడులకు అనుకూలదినం కాదు.