రాశి ఫలాలు: 31 జనవరి 2019 గురువారం

రాశి ఫలాలు: 31 జనవరి 2019 గురువారం

మేషం:
పై అధికారులతో, సహోద్యోగులతో స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంది. కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి.
వృషభం:
భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ప్రయాణం, దేవాలయ సందర్శన చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి.
మిథునం:
చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలో మీ పనికి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం. విందులో పాల్గొంటారు.
కర్కాటకం:
డబ్బు విషయంలో సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించకపోవడం, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అనువైన దినం కాదు.
సింహం:
ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆరోగ్యం మీ ఆందోళనకు కారణమవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోండి. 
కన్య:
ఆర్థికంగా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు వరిస్తుంది. ఉద్యోగం విషయంలో శుభవార్త వింటారు. ప్రయాణ సూచన ఉంది.
తుల:
పనులు వాయిదా పడటం, అనుకోని అడ్డంకులు రావడం జరుగవచ్చు. పట్టువదలక ప్రయత్నించండి. పని ఒత్తిడి కారణంగా స్వల్ప మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. 
వృశ్చికం:
దూర ప్రదేశం నుంచి శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.
ధనుస్సు:
ఆరోగ్యం విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. మానసికంగా ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.
మకరం:
ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. మిత్రులను కలువడం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. 
కుంభం:
వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి.
మీనం:
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిద్రలేమి కారణంగా రోజంతా అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది. ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది.