రాశిఫలాలు: శుక్రవారం 1 మార్చి 2019

రాశిఫలాలు: శుక్రవారం 1 మార్చి 2019

మేషం: 
ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. డబ్బు నష్టపోయే అవకాశముంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి వినోద యాత్ర చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. వివాహ సంబంధ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.
వృషభం:
ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన ప్రయాణాలు మధ్యలో ఆపవలసి రావటం, ఏదైనా అడ్డంకి ఎదురవటం జరగవచ్చు. అనవసర వివాదాలు ఏర్పడవచ్చు. ఇతరుల విషయాల్లో  కలగజేసుకోకండి.
మిథునం: 
మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. డబ్బు ఖర్చు చేస్తారు. పెట్టుబడులకు సామాన్య దినం. చర్చలకు అనుకూల దినం. దూర ప్రయాణాలకు చేసే అవకాశం ఉంది.
కర్కాటకం: 
రోజంతా ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్యం కుదుటపడుతుం ది. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. లావాదేవీలు ఒక కొలిక్కి వస్తాయి. కోర్టు కేసులు, వివాదాలు పరిష్కరించబడతాయి.
సింహం: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. ప్రయాణం, ఉద్యోగంలో మార్పు ఉంటుంది. వ్యాపార లావాదేవీలకు అనుకూల దినం కాదు. ఎక్కువ డబ్బు దగ్గర పెట్టుకొని ప్రయాణించకండి.
కన్య: 
పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. సీగేపట్టిన పనులు పూర్తవుతాయి.
తుల:
రోజంతా అనుకూలంగా ఉంటుంది. వృత్తి పరంగా మంచి గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్‌ లేదా ట్రాన్స్ఫర్‌ కొరకు ఎదురుచూస్తున్న వారికి ముఖ్య సమాచారం అందుతుంది. మిత్రులను లేదా బంధువులను కలుస్తారు.
వృశ్చికం: 
మానసికంగా కొంత అశాంతిగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశముంది. బంధువులతో మాట కారణంగా సమస్య వచ్చే అవకాశముంటుంది. దూర ప్రయాణాల విషయంలో అనుకూలం. పెట్టుబడులకు అనుకూల దినం కాదు.
ధనుస్సు: 
ఆర్థికంగా అనుకూలిస్తుంది. మొండి బకాయిలు వసూలవుతాయి. పనికోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. బంధువులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
మకరం:
చేపట్టిన పనులు పూర్తికావు. మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది. కీలక విషయంలో కూడా జాగ్రత్త. గృహసంబంధ వ్యవహారాలలో బిజీగా గడుపుతారు. మిత్రులను కలుస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త.
కుంభం:
రోజంతా ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు పూర్తవుతాయి. అవకాశాలు అందివస్తాయి. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణ సూచన ఉంది.
మీనం:
కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. మీరు ప్రారంభం చేసే పనుల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రగతి సాధిస్తారు. ఆటంకాలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.