రాశి ఫలాలు: మంగళవారం 12 మార్చి 2019

రాశి ఫలాలు: మంగళవారం 12 మార్చి 2019

మేషం: 
ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు ఉన్నాయి. విలువైన వస్తువులు, నగల విషయంలో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో అజాగ్రత్తగా ఉండకండి. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోవడం మంచింది.
వృషభం: 
రోజంతా ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. విందులో పాల్గొంటారు.
మిథునం: 
ఉద్యోగ, వ్యాపారంలో అభివృద్ధి కొరకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్, అనుకున్న మార్పు చోటు చేసుకుంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అనుకూలం.
కర్కాటకం: 
ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఎక్కువ డబ్బు ఖర్చయ్యే అవకాశముంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. మిత్రులను  కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్గొంటారు. 
సింహం: 
మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. చేపట్టిన పనులు, ప్రయాణాలు వాయిదా పడతాయి. అనవసర ఖర్చు ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్త. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
కన్య: 
ఈ రోజు స్నేహితులు, జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం కొనుగోలు, భూ సంబంధ వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త. 
తుల: 
గృహ సంబంధ వ్యవహారాల్లో మునిగితేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనడం, వాహనం కొనుగోలు చేయడం చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోండి.
వృశ్చికం: 
ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా జరుగుతుంది. సాయం చేస్తా అన్నవారు కూడా సమయానికి మాట మార్చుతారు. మానసికంగా ఆందోళనకు, అసహనానికి గురవుతారు. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. కీలక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. 
ధనుస్సు: 
ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. మీ కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
మకరం: 
మీ ప్రవర్తన కారణంగా మీ బంధువులు అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. వారి నమ్మకాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి. తొందరపడి నిర్ణయం తీసుకోకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
కుంభం: 
ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. మీ మాటతీరు కారణంగా అనవసరపు వివాదాలు తలెత్తే అవకాశముంటుంది. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకండి. మానసికంగా దృఢంగా ఉండడం మంచిది. ప్రయాణ సూచన ఉంది. విందువినోదాల్లో పాల్గొంటారు.
మీనం: 
రోజంతా స్నేహితులతో గడువుతారు. మీ జీవిత భాగస్వామి నుంచి అనుకోని సాయం లభిస్తుంది. మీ మధ్య ఉన్న మనస్పర్థలు తొలగిపోతాయి. మీ ప్రేమ వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. పెట్టుబడులకు అనువైన రోజు.