రాశి ఫలాలు: 19 మార్చి 2019 మంగళవారం

రాశి ఫలాలు: 19 మార్చి 2019 మంగళవారం

మేషం: 
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు.ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూల దినం. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఏదో తెలియని చిన్న ఆందోళన మనసులో ఉంటుంది. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోండి.
వృషభం: 
ఇంటికి సంబంధించిన పనులు చేయటానికి, గృహ సంబంధ వ్యవహారాలకు అనుకూలంగా ఉంటుంది. అయితే కొంత జాగ్రత్తగా అవసరం. చదువు పట్ల కొంత నిరాసక్తత ఉంటుంది. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
మిథునం: 
చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. మానసిక ప్రశాంతత కోసం స్నేహితులు లేదా బంధువులతో గడపండి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు తిరిగి ప్రారంభమవుతాయి.
కర్కాటకం: 
ఆర్థికంగా కొంత సామాన్యంగా ఉంటుంది. పాత బాకీలు వసూలైనప్పటికీ.. అందుకు తగిన ఖర్చులు ఉన్నాయి.పెట్టుబడులకు, వ్యాపార లావాదేవీలకు అనువైన రోజు కాదు. ఇంటికి సంబంధించి ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. డబ్బు ఖర్చయ్యే అవకాశముంటుంది.
సింహం: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో కలిసి శుభకార్యంలో పాల్గొంటారు. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటారు.
కన్య: 
రోజంతా కొంత బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయటానికి ముందుకు రారు. ప్రయాణంలో జాగ్రత్త అవసరం. మిత్రులతో కానీ, దగ్గరి బంధువులతో కానీ వివాదం జరుగవచ్చు. వారితో జాగ్రత్తగా ఉండండి. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోండి.
తుల: 
రోజంతా అనుకూలంగా ఉంటుంది. మిత్రులు, బంధువులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి. వృత్తిలో అనుకోని ప్రశంస, గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చికం: 
వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయడానికి అనుకూల సమయం. పై అధికారులను కలువడానికి, ముఖ్యమైన ఒప్పందాలకు అనుకూలించే దినం. అనుకోని బహుమతులు, ప్రశంసలు పొందుతారు. విందువినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు: 
రోజువారీ పనుల నుంచి విశ్రాంతి కోరుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ప్రయాణంలో అడ్డంకుల ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లోకి కొత్త వస్తువులు కొనడం కానీ, ఇల్లు సర్దడం కానీ చేస్తారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.
మకరం: 
మానసికంగా కొంత ఆందోళనతో ఉంటారు. ఒక సంఘటన కారణంగా మీ మనసు చెదురుతుంది. ఆర్థిక నష్టం, కోపం, అనారోగ్యం, కలహాలు, ఆందోళన మొదలైన భయం ఈ రోజు సూచించబడ్డాయి. ఆవేశాన్ని, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం తీసుకోండి.
కుంభం: 
ఇతరులతో సంబంధ, బాంధవ్యాలు పెంచుకోవడానికి అనుకూల దినం. అలాగే ఒప్పందాలను, అంగీకారాలను కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. ప్రేమను వ్యక్తం చేయడానికి అనువైన రోజు. ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన చెందుతారు. ఉద్యోగ మార్పు ఉంది.
మీనం: 
వివాదాలు పరిష్కరించబడుతాయి. ఒప్పందాలు చేసుకోవటానికి అనుకూల దినం. ఈ రోజు అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక లాభాలుంటాయి. గృహ, వాహనాలు కొనుగోళ్లు చేస్తారు. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి.