రాశి ఫలాలు: బుధ‌వారం 6 మార్చి 2019

రాశి ఫలాలు: బుధ‌వారం 6 మార్చి 2019

మేషం: 
బంధువులను కలుసుకుంటారు. వివాహం లేదా ఇతర శుభకార్యాల్లో పాల్గొంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఇతరుల కోపానికి, అసహనానికి కారకులయ్యే అవకాశముంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయాణ సూచన ఉంది.
వృషభం:
వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. విందులో పాల్గొంటారు.
మిథునం: 
కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసర వివాదాలకు తావివ్వకండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలం. కీలక విషయాల్లో పెద్దల నిర్ణయం పనికొస్తుంది.
కర్కాటకం: 
మీ పై అధికారులు, సహోద్యోగులతో స్నేహ పూర్వకంగా మెలగటం మంచిది. అనుకోని వివాదాలు జరిగే అవకాశముంది. కాబట్టి కోపానికి, ఆవేశానికి తావివ్వకండి. వివాదాలకు దూరంగా ఉండండి.
సింహం: 
జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. దేవాలయ సందర్శన చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూలం. ప్రయాణ సూచన ఉంది.
కన్య: 
వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. ఉద్యోగంలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రయాణాలకు సాధారణ దినం.
తుల: 
డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించదు. పెట్టుబడుల కారణంగా నష్టపోవటం జరగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ప్రయాణాల్లో కూడా జాగ్రత్త. 
వృశ్చికం: 
ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల, బంధువుల ఆరోగ్యం ఆందోళనకు కారణమవుతుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.
ధనుస్సు: 
ఆర్థికంగా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు వస్తాయి. తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు వస్తుంది. చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.
మకరం: 
చేపట్టిన పనులు వాయిదా పడతాయి. అనుకోని అడ్డంకులు ఉన్నాయి. పట్టువదలక ప్రయత్నించి విజయం సాధించండి. పని ఒత్తిడి కారణంగా స్వల్ప మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. కీలక విషయాల్లో పెద్దలతో చర్చించండి. 
కుంభం: 
దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. విందులో పాల్గొంటారు. 
మీనం: 
ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.