హౌస్ ఫుల్ 4 వినూత్న ప్రచారం..   

హౌస్ ఫుల్ 4 వినూత్న ప్రచారం..   

అక్షయ్ కుమార్, రితేష్ దేశ్ ముఖ్, బాబీ డియోల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా హౌస్ ఫుల్ 4.  ఈ సినిమా దీపావళి రోజున రిలీజ్ కాబోతున్నది.  రిలీజ్ సమయం దగ్గరపడుతుండటంతో యూనిట్ సరికొత్తగా ప్రచారం చేస్తున్నది.  ఈ ప్రచారంలో భాగంగా ముంబై నుంచి ఢిల్లీ వరకు ఓ రైలులో ప్రచారం చేయబోతున్నారు.  

ఈ రైలు మొత్తం హౌస్ ఫుల్ 4 పోస్టర్లతో నిండిపోయింది.  అక్టోబర్ 16,17 వ తేదీల్లో ఈ రైలు ముంబై నుంచి ఢిల్లీకి ప్రయాణం చేస్తుంది.  ఈ ట్రైన్ లో ప్రయాణికులతో పాటుగా చిత్ర బృందం కూడా ప్రయాణం చేయబోతున్నది.  ప్రయాణికులతో యూనిట్ వివిధ విషయాలు పంచుకోబోతున్నది.  ఈ ట్రైన్ కు తాత్కాలికంగా హౌస్ ఫుల్ 4 ఎక్స్ ప్రెస్ అనే పేరును పెట్టినట్టు రైల్వే శాఖ తెలియజేసింది.  ఈ విషయాన్ని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  మరి ఈ ట్రైన్ ప్రచారం సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.