సరిలేరు నీకెవ్వరూలో విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతుంది..?

సరిలేరు నీకెవ్వరూలో విజయశాంతి పాత్ర ఎలా ఉండబోతుంది..?

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇందులో మహేష్ బాబుతో పాటు కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్న సంగతి తెలిసిందే.  13 సంవత్సరాల తరువాత విజయశాంతి  తిరిగి సినిమా రంగంలోకి అడుగుపెట్టింది.  కాగా, ఇందులో విజయశాంతి ఎలాంటి రోల్ చేస్తుంది.. ఆమెకు సంబంధించిన లుక్ ఎలా ఉండబోతుంది అనే విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు.  ఆమె పాత్రను ఎక్కడా రివీల్ చేయడంలేదు దర్శకుడు.  

ఇందులో విజయశాంతితో పాటుగా పరుచూరి గోపాలకృష్ణ కూడా ఓ కీలక పాత్ర చేస్తున్నారు.  అయన చెప్పిన సమాచారం ప్రకారం సినిమాలో విజయశాంతి పాత్ర అద్భుతంగా ఉంటుందని, రీ ఎంట్రీకి తగ్గట్టుగా ఆమె పాత్రను తీర్చిద్దిదారని అంటున్నారు. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని అంటున్నారు.  అయితే, ఆ పాత్రకు సంబంధించిన విశేషాలను, పాత్ర స్వభావాన్ని బయటపెట్టకూడదని యూనిట్ నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందుకే గోప్యంగా ఉంచుతున్నారని గోపాలకృష్ణ చెప్పారు.  మరి ఆమె పాత్ర ఎలా ఉండబోతుంది ఏంటి అన్నది తెలియాలంటే.. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందేనా..