నూరేళ్ల వృద్ధుడి ప్రేమ లోతెంతో చూస్తారా?

నూరేళ్ల వృద్ధుడి ప్రేమ లోతెంతో చూస్తారా?

ఎలాంటి పరిమితులూ లేనిదే ప్రేమ. దాన్ని ప్రకటించుకోవడానికి మనసు తప్ప మరే కొలమానమూ ఈ ప్రపంచంలో లేదు, ఉండదు. అందుకు ఈ వీడియోనే సజీవ సాక్ష్యం. అమెరికా నేవీలో పని చేసి రిటైరైన లూథర్.. వేవర్లీని పెళ్లి చేసుకున్నాడు. తొలి చూపులోనే, తొలి ఇంట్రడక్షన్లోనే వేవర్లీ కూడా లూథర్ ను పెళ్లాడేందుకు ఓకే చెప్పేసింది. అయితే అప్పటికే పెళ్లయిన వేవర్లీతో లూథర్ ఓపెన్ గా మాట్లాడడం విశేషం. 

మీరు చాలా అందంగా ఉంటారు... మీకు భర్త ఉన్నాడా.. అడిగాడు లూథర్.
నో.. నాకు భర్త లేడు. ఆయనో తాగుబోతు.. చెప్పింది వేవర్లీ. 
దాంతో మరో అడుగు ముందుకేసిన లూథర్.. మీలాంటి ఒకరు నాక్కావాలి.. అది మీరే ఎందుక్కాకూడదు.. అడిగాడు. 
ఆ ప్రపోజల్ కోసమే ఎదురుచూస్తున్నట్టుగా ఉన్న వేవర్లీ వెంటనే ఓకే చెప్పింది. అదీ వారి గురించి చిన్న బ్యాగ్రౌండ్.

ఇక అసలు విషయమేంటంటే... వేవర్లీకి 9 ఏళ్ల క్రితం బ్రెయిన్ ట్యూమర్ సోకింది. అప్పట్నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లడం.. తీసుకురావడం.. కొద్దిరోజులు హాస్పిటల్లో, కొద్ది రోజులు ఇంట్లో.. ఇలా రోజూ ఆమె బాగోగులే ఆయన డ్యూటీ. 

ఇక ఇప్పుడైతే పూర్తిగా ఆస్పత్రిపాలైన వేవర్లీని చూసేందుకు, ఆమెకు కాఫీ ఇచ్చేందుకు లూథర్ ప్రతిరోజూ ఇంటి నుంచి 3 మైళ్ల దూరంలో ఉన్న ఆస్పత్రికి ఇలా నడుచుకుంటూ, పరుగెత్తుకుంటూ వస్తాడు. కార్లో, బస్సులో రావచ్చు. కానీ అది ఆయనకు నచ్చదు. తన ప్రేమను ఆ విధంగా ప్రకటించుకుంటాడు. ఆస్పత్రి దగ్గరికి వచ్చిందంటే చాలు.. ఆయన కాలు ఆగనైనా ఆగదు. చూడండి.. ఎలా పరుగెత్తుతాడో.. 

ఇంత లేటు వయసులో కూడా భార్యను నిత్యనూతనంగా ప్రేమిస్తున్న ఓ భర్త ఉదంతంగా సీబీఎస్ న్యూస్.. ట్విట్టర్లో రిపోర్ట్ చేసింది. ఆయన ప్రేమలోని ఆర్తిని ఆస్వాదించండి.